ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
  • ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
  • మే 3 నుండి 9వ తేదీ వరకు పరీక్షలు
  • మొత్తం 81 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ మోడ్‌లో నిర్వహణ

ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షలు మే 3 నుండి 9 వరకు జరుగుతాయి. మొత్తం 81 పోస్టుల భర్తీకి 4,496 మంది అభ్యర్థులు అర్హత పొందారు. ప్రశ్నాపత్రం ట్యాబ్‌లలో అందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2025 మే 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతాయి. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన ప్రిలిమ్స్‌లో 1,48,881 మంది అభ్యర్థులు పాల్గొనగా, 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.

మెయిన్స్ పరీక్షల తేదీలు:

  • మే 3: క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (తెలుగు)
  • మే 4: క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (ఇంగ్లీష్)
  • మే 5: పేపర్ 1 – జనరల్ ఎస్సే
  • మే 6: పేపర్ 2 – ఇండియా, ఏపీ చరిత్ర, సంస్కృతి, భూగోళ శాస్త్రం
  • మే 7: పేపర్ 3 – పాలిటి
  • మే 8: పేపర్ 4 – ఇండియా, ఏపీ ఎకానమీ
  • మే 9: పేపర్ 5 – సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు

ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ మోడ్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌ల ద్వారా అందించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment