*తెలంగాణ టిడిపి నాయకులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ*
*తెలంగాణలో పూర్వ వైభవం కోసం సీఎం చంద్రబాబు ఫోకస్*
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి హైదరాబాద్:అక్టోబర్ 07
తెలంగాణలో టీడీపీ పార్టీ అభివృద్ధిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఫోకస్ పెట్టారు. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పార్టీ అభివృద్ధి గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు.ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో ఈరోజు సాయంత్రం భేటీ కానున్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికలపై ఆయన చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ స్థానానికి నవంబర్ 11న ఎన్నిక జరగనుంది. ఇక్కడ టీడీపీకి క్యాడర్ ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా..? లేదంటే ఇతరులకు మద్దతు ఇవ్వాల అనేదానిపై చర్చించనున్నారు.
*మళ్ళీ పూర్వ వైభవం కోసం పాకులాట*
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకు రావాలని చంద్రబాబు కొంతకాలంగా ప్రయత్ని స్తున్నారు. గతంలో తెలంగాణలో కీలకంగా ఉన్న పార్టీకి.. ఇప్పుడు కూడా రెండు మూడు జిల్లాల్లో పట్టు ఉంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ తెలంగాణలో 15 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణలో టీడీపీ గురించి బాబు పట్టించుకోవడం మానేశారు. తెలంగాణ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలుగా పలువురు పని చేసినా ఎన్నికల్లోపోటీ చేసే అవకాశం మాత్రం ఇవ్వలేదు చంద్రబాబు.