మానవత్వానికి మరో రూపం రక్తదానం

మానవత్వానికి మరో రూపం రక్తదానం

మానవత్వానికి మరో రూపం రక్తదానం

రక్తదానంపై అపోహలు వీడాలి

వి.విజయ్ కుమార్,ఆర్ జిఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు

మనోరంజని ,కర్నూలు ప్రతినిధి ఆగస్టు 02 – కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.అయితే ఆ వ్యక్తికి రక్తం తక్కువ ఉండడం వల్ల రక్తం అవసరం అయింది.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆర్ జిఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు వి.విజయ్ కుమార్ కు సమాచారం తెలియచేశారు.దీంతో మానవతా దృక్పథంతో విజయ్ కుమార్ స్పందించి, శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు.అనంతరం రక్తదానం చేసిన విజయ్ కుమార్ ను రోగి కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ…సమాజం నాగరికతలో ఎంతో అభివృద్ధి చెందుతుంది.కానీ మానవత్వంలో వెనకబడుతుంది. ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపిస్తుంది. మనిషిలో మొదటగా మానవత్వం పెరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.మనిషికి ఆపద కలిగినపుడు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరు స్వీకరించాలని అన్నారు. ఎన్ని ఆస్తులు,అంతస్తులు ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక రోజు రక్తం అవసరం అవుతుందన్నారు.అలాంటి సమయంలో ఇతరులపై నేటికీ ఆధారపడాల్సి వస్తుంది అన్నారు. రక్తదానంపై అపోహలు విడాలి.రక్తం ఇవ్వడం వల్ల తమ శరీరంలో కొత్త రోగాలు వస్తాయి అనే అపోహతో చాలా మంది ఇతరులకు రక్తం ఇవ్వడంలో ముందుకురాకపోవడం జరుగుతుంది.ఇది సరి కాదన్నారు. మనిషి శరీరమైన,ఒక వాహనమైన రెండు ఒక్కటే అన్నారు.ఒక వాహనంలో ఇంజిన్ ఆయిల్ ను ఎలాగైతే మార్చుకుంటామో, అలాగే మనిషి శరీరంలో కూడా కొత్త రక్తం వచ్చేలా అవకాశం కల్పించాలని సూచించారు.అందుకు ఆపద సమయంలో ఇతరులకు రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం సరఫరా అవుతుందని పేర్కొన్నారు.కొత్త రక్తం సరఫరా అవుతున్న శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.
కావున ఇప్పటికైనా ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు,స్నేహితులు తమ రక్తం యొక్క గ్రూప్ తెలుసుకోవాలి.ఆపద సమయంలో సాటిమనిషికి దైర్యంగా రక్తదానం చేసేలా మార్పు చెందాలని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment