మహాలక్ష్మీనగర్‌లో మానవ హక్కుల కమిటీ వార్షిక సమావేశం
అవినీతి నిర్మూలనకే మా ప్రధాన లక్ష్యం — మాల్వేకర్ ధర్మేంద్ర
మనోరంజని తెలుగు టైమ్స్, నిజామాబాద్, డిసెంబర్ 26:
నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మీనగర్‌లో మానవ హక్కుల కమిటీ వార్షిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మేంద్ర మాట్లాడుతూ, “మానవ హక్కుల కమిటీ ప్రధాన ఉద్దేశం అవినీతిని తుదముట్టించడం. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరిపోతుంది. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు జరిగినా, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పై అధికారుల నిఘా సరిగా లేకపోవడం వల్లే అవినీతి కొనసాగుతోంది,” అని వ్యాఖ్యానించారు. “ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ అవినీతి శోచనీయం. ప్రభుత్వం తక్షణమే అవినీతి పట్ల ప్రత్యేక నిఘా కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందూరు (నిజామాబాద్)కు మంచి పేరు తెచ్చేలా చర్యలు తీసుకోవాలి,” అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నగర అధ్యక్షులు జే. లక్ష్మణ్, కమిటీ కార్యదర్శులు దినేష్, సంతోష్, రాజేశ్వర్, శ్యామ్, షేక్ గౌస్, ఫైజాన్, నరేందర్ సింగ్, నాగ సాయి తదితరులు పాల్గొన్నారు.