పెద్దపల్లి జిల్లా: అక్టోబర్ 18
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, సుల్తానా బాద్ మాజీ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్నయ్య గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన అన్నయ్య గౌడ్, తనను ఈ పదవిలో నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహకరించిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అన్నయ్య గౌడ్ జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.