జఠశంకర ఆలయంలో అన్నదాన కార్యక్రమం
ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 28
మండల కేంద్రమైన ముధోల్ లోని పురాతన జఠ శంకర్ ఆలయం వద్ద శ్రావణ మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ముధోల్ బొగడ వాడకట్టు మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో అభిషేకం, పూజ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్న ప్రసాదం స్వీకరించడానికి స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తాలూకా సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్, పెద్ద కాపులు రోళ్ళ బాలాజీ, తెలగడం ధర్మన్న, హంగీర్గ లక్ష్మణ్, మెంబర్లు వెంకటపురం పోతన్న, హంగీర్గ భోజన్న, బిడిసి అధ్యక్షులు వరగంటి విట్టల్, ఉపాధ్యక్షులు పల్లె నగేష్, కోశాధికారి వెంకటేష్ జిందంవార్ సహకార్యదర్శి ఆగాలం దశరథ్, ప్రముఖ వ్యాపారవెత్త రాంచందర్, గ్రామస్తులు, భక్తులు,తదితరులు పాల్గొన్నారు