భీమారం లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి
మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
గుణక పూలు తంగేడు పూలు కట్ల పూలు తామర పూలు మందార పూలు గుమ్మడి పూలు బంతిపూలు చామంతి పూలు ఇలా తొమ్మిది రకాల పూలతో తొమ్మిది రకాల నైవైద్యాలతో తొమ్మిది రోజులు ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ గా తొలిరోజు మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పువ్వుల బతుకమ్మ ను జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతి లో బతుకమ్మ పాటలతో తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ ను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంలో మహిళలు, కాలనీ వాసులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.