అంగన్వాడి పోషణ మాస కార్యక్రమం
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా ప్రతినిధి, అక్టోబర్ 15, 2025
భైంసా ఓవైసీ సెక్టార్‌లో అంగన్వాడి పోషణ మాస కార్యక్రమం నిర్వహణ
నిర్మల్ జిల్లా భైంసా ప్రాజెక్ట్‌లోని ఓవైసీ సెక్టార్ పరిధిలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు పోషకాహార ప్రాధాన్యం, పిల్లల ఎత్తు-బరువు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజశ్రీ, సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా భైంసా ప్రాజెక్ట్‌లోని ఓవైసీ సెక్టార్ పరిధిలో బుధవారం అంగన్వాడీ పోషణ మాస కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పోషకాహార ప్రాముఖ్యతపై వివరణ ఇచ్చి, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.
పిల్లల ఎత్తు, బరువులను కొలిచి తల్లిదండ్రులకు వివరించారు. సిడిపిఓ రాజశ్రీ మాట్లాడుతూ — “పిల్లల శారీరక అభివృద్ధి, మానసిక వికాసం కోసం సమతుల్య ఆహారం చాలా ముఖ్యమని” అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.