- వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం.
- సోమవారం బైంసా కేంద్రంగా ప్రారంభం.
- జర్నలిస్టుల సంక్షేమానికి WJI కట్టుబడి ఉంది.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI-TG) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం బైంసా పట్టణంలో సోమవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ మరియు కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
దేశంలోనే రెండవ అతిపెద్ద కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI-TG) తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బైంసా పట్టణం సమీపంలోని ఖతగాం గ్రామంలోని వేద తపోవనం పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్ తెలిపారు.
జర్నలిస్టుల ఆకాంక్షలకు అనుగుణంగా వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఏకచత్రాధిపత్యం, అప్రజాస్వామిక విధానాలకు తావు లేకుండా ఈ సంస్థ పని చేస్తుందని వారు స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బైంసాకు చెందిన పాత్రికేయుడు మాధవరావు సమన్వయం చేయనున్నారు.
జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించే సమర్థవంతమైన నాయకత్వంతో WJI, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో పనిచేస్తోంది. నిర్మల్ జిల్లా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో WJI సభ్యత్వం పొందాలని, తమ సన్నిహితులను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యత్వానికి సంబంధించిన వివరాల కోసం మాధవరావు – 9014163335, 9666665026 నంబర్లను సంప్రదించవచ్చు.