అడెల్లి పోచమ్మ పునః ప్రతిష్ట మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

అడెల్లి పోచమ్మ పునః ప్రతిష్ట మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేత

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 01

నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను ఆహ్వానించారు. శనివారం హైదరాబాదులో మంత్రి కార్యాలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ సింగం భోజ గౌడ్, సారంగాపూర్ మాజీ జెడ్పిటిసి సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. నవంబర్ 3 నుండి 7 వరకు వేద పండితుల ఆధ్వర్యంలో అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉట్ల రాజేశ్వర్, సాయి కృష్ణ గౌడ్, భూమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment