- ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనపై అవగాహన కల్పింపు.
- విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణకు వివరాలు.
- మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం.
బోధన్ ప్రభుత్వ మధుమలాంచ జూనియర్ కళాశాల విద్యార్థులకు మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 120 మంది విద్యార్థులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని ప్రభుత్వ మధుమలాంచ జూనియర్ కళాశాల విద్యార్థులకు మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డి హెచ్ ఈ డబ్ల్యూ జిల్లా మిషన్ సమన్వయ కర్త పి. స్వప్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనపై వివరాలు అందించారు. యుక్త వయసులో ఉన్న విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ కేంద్రాల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్ల వివరాలు తెలియజేశారు.
ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు పి. పుష్ప విద్య, లక్ష్య సాధనలో పట్టుదల ప్రాధాన్యతను వివరించారు. కౌశల్ వికాస్ యోజన కేంద్రం మేనేజర్ మహేష్ శిక్షణా కోర్సుల వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్, వసతులపై వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆసియా, మొబలైజర్ ప్రదీప్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు.