కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏఎంఆర్ చైర్మన్

కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటాన్ని సమర్పిస్తున్న మహేశ్వరరెడ్డి

కరీంనగర్ | ఫిబ్రవరి 12, 2025

  • ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి దంపతుల విరాళం
  • కోటి పది లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సమర్పణ
  • స్వామివారి మూలవిరాట్‌కు బంగారు కిరీటాన్ని ఆలయ అర్చకుల సమక్షంలో అలంకరణ

 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి దంపతులు బంగారు కిరీటాన్ని బహూకరించారు. అదనంగా సీతారాముల విగ్రహం, 55 కిలోల వెండితో మకరతోరణం, గర్భగుడి ద్వారాలకు తొడుగులను విరాళంగా అందించారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం స్వామివారికి ఆభరణాలను అలంకరించారు. ఆలయ అధికారులు మహేశ్వరరెడ్డి కుటుంబాన్ని సత్కరించి ఆశీర్వాదం అందజేశారు.

 

హైదరాబాద్‌కు చెందిన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి దంపతులు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని స్వామివారి మూలవిరాట్‌కు బంగారు కిరీటాన్ని సమర్పించారు. అలాగే సీతారాముల విగ్రహం, 55 కిలోల వెండితో మకరతోరణం, గర్భాలయ ద్వారాలకు వెండి తొడుగులను విరాళంగా అందించారు.

ఈ బంగారు, వెండి ఆభరణాల తయీరికి సుమారు రూ. 1.10 కోట్ల వ్యయం అయినట్లు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ వెంకట్ తెలిపారు. ఆలయంలో సంప్రోక్షణ అనంతరం అర్చకులు ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. మహేశ్వరరెడ్డి కుటుంబాన్ని ఆలయ అధికారులు సత్కరించి, ప్రసాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, అధ్యక్షుడు గంగాధర్ శర్మ, ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment