అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన: మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో అభివృద్ధి పై చర్చ

అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ గుండం గ్రామంలో గ్రామస్తులతో సమావేశం దృశ్యం.
  • ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లాలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.
  • గుండం గ్రామంలో విద్యార్థులు, యువత, గ్రామస్తులతో సమావేశం.
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం మాలిక సదుపాయాలపై చర్చ.
  • భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ పర్యటన కొనసాగుతోంది.

 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా గుండం గ్రామంకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ఆయన విద్యార్థులు, గ్రామస్తులతో కూలంకషంగా చర్చలు జరిపారు. పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.


 

బీజాపూర్, డిసెంబర్ 16:

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్‌ఘడ్‌లోని మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రారంభమై, గ్రామ ప్రజలతో నేరుగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అమిత్ షా అక్కడి యువత, విద్యార్థులు, మరియు గ్రామస్తులతో మాట్లాడి, వారి సమస్యలపై పూర్తిగా అవగాహన పొందారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాధాన్యత గురించి ఆయన స్పష్టం చేశారు.

బీజాపూర్ జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, ఈ పర్యటన సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ పర్యటనకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉన్నదని అమిత్ షా పునరుద్ఘాటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment