160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే 160కి పైగా స్థానాలు గెలుస్తుందని ఆయన అన్నారు. బీజేపీ, జేడీయూ దాదాపు సమాన సీట్లు సాధిస్తాయని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాలు బలోపేతమయ్యాయని, భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.