- అమిత్ షా వ్యాఖ్యలపై బీఎస్పీ నిరసన
- అంబేద్కర్ గారిని అవమానించడంపై ఆగ్రహం
- హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
- భారత రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని ఆరోపణ
భైంసా మండల మహగాం గ్రామంలో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి అవహేళన అన్నారు. ఆయన హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని భైంసా మండల మహగాం గ్రామంలో బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని, అవి రాజ్యాంగానికి అవమానం అని తెలిపారు.
జగన్ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “భారత రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జ్ఞానం ప్రపంచదేశాలు కొనియాడుతుంటే, ఆయనపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని” అన్నారు. దేశ ప్రజల ముందు అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“రాజ్యాంగ బిక్షతోనే బీజేపీ ఈ రోజు అధికారంలో ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం లేకుండా బీజేపీ దేశాన్ని పాలించగలిగేదా?” అని ప్రశ్నించారు. అంబేద్కర్ గారిని అవమానించడం బీజేపీ సంకుచిత రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జీ పవార్ అనిల్, జిల్లా మహిళ కన్వీనర్ ఎస్కే లక్ష్మీ యాదవ్, మండల అధ్యక్షులు శ్రీదర్, లక్ష్మణ్ చంద్ర, శంకర్ చంద్ర, బైంసా మండల కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.