అంబులెన్స్ డ్రైవర్ సుభాష్ సేవలు అభినందనీయం
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29
ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఉన్నానంటూ సుభాష్ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ఆకాష్ గడపాలే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సుభాష్ తన సొంత వాహనంలో సమయానికి భైంసా ఆసుపత్రికి చేరుకొని మెరుగైన చికిత్స అందజేసి పలువురి చేతమన్ననలు పొందుతున్నారన్నారు. గర్భిణి స్త్రీలకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న సేవలు గురించి అవగాహన కల్పిస్తున్నాడు. సుభాష్ తన సోదరుని భార్యకు పురిటి నొప్పులు రావడంతో సమాజ సేవగానే భావించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. అనంతరం డాక్టర్ ఆకాష్ గర్భిణి ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మతీన్, హెడ్ నర్సు విజయ లక్ష్మీ తో పాటు ఆస్పత్రి సిబ్బంది, తదితరులున్నారు