2025-26 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు

2025-26 బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, AP Infrastructure Development
  • పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు, నిర్మాణానికి అదనంగా రూ. 12,157 కోట్లు
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ. 730 కోట్లు
  • ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు
  • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ. 186 కోట్లు
  • రాష్ట్ర రహదారులు, వంతెనల అభివృద్ధికి రూ. 240 కోట్లు
  • ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 242.50 కోట్లు

 

2025-26 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటాయింపులు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు, నిర్మాణానికి అదనంగా రూ. 12,157 కోట్లు మంజూరు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 3,295 కోట్లు, పోర్టు అభివృద్ధికి రూ. 730 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి రూ. 240 కోట్లు కేటాయించారు.

 

2025-26 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, రోడ్లు, వంతెనల అభివృద్ధి, ఆరోగ్య రంగం, నేచురల్ ఫార్మింగ్ వంటి రంగాలకు పెద్దపీట వేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా కేంద్రం రూ. 5,936 కోట్లు కేటాయించగా, అదనంగా బ్యాలెన్స్ గ్రాంటుగా రూ. 12,157 కోట్లు మంజూరు చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి రూ. 3,295 కోట్లు కేటాయించగా, విశాఖ పోర్టు విస్తరణకు రూ. 730 కోట్లు కేటాయించింది.

రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ. 162 కోట్లు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ. 186 కోట్లు కేటాయించారు. రహదారులు, వంతెనల అభివృద్ధికి రూ. 240 కోట్లు, ఇరిగేషన్, లైవ్లీహుడ్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 242.50 కోట్లు కేటాయించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment