ఎన్నికలలో అవకతవకలపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపణలు

ఎన్నికలలో అవకతవకలపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపణలు

ఎన్నికలలో అవకతవకలపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపణలు

 

  • అర్పిసి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఆరోపణలు

  • ఎన్నికల నిర్వహణలో అన్యాయాలు జరిగాయని అభిప్రాయం

  • పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు



రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పార్టీ వారాంతపు సమావేశంలో ఎన్నికల వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని, కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిందని ఆరోపించారు.



రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో పార్టీ వారాంతపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVM) వినియోగంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో అన్యాయాలు జరిగాయని, ఎన్నికల సంఘం పిర్యాదులను సకాలంలో పరిష్కరించలేదని ఆరోపించారు. తన పార్టీకి ఎన్నికల గుర్తుపై జరిగిన వివాదాన్ని కూడా ప్రస్తావించారు. రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు పారదర్శకత అవసరమని ఆయన అన్నారు.

సభకు అర్పిసి సీనియర్ నాయకుడు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, పార్టీ నేతలు డి.వి. రమణమూర్తి, లంక దుర్గాప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment