గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి ఉంటాం

గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి ఉంటాం

గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి ఉంటాం

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 18

ముధోల్ మండలంలోని బోరిగo గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఒక విషయం పై బేధాలు వచ్చినవి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్, పోలీస్ శాఖ తరపున ఎస్పీఆ విషయాన్ని పరిష్కారంలో చొరవ చూపటం వలన గ్రామస్తులందరు ( అన్ని కులాల వారు ) కూర్చొని ఇకనుంచి అందరం కలిసి మెలిసి ఉందాం విభేదాలకు తావు లేకుండా అందరం కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుదాము అని నిర్ణయించడం జరిగింది. ఈ విషయంపై వీరందరూ జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిసి విషయం చెప్పడం జరిగింది. వీరందరూ మాజీ శాసనసభ్యులు జి.విట్టల్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ విషయంతో పాటు గ్రామంలో అందరి దైవమైన పోచమ్మ తల్లి ఆలయము, ముత్యాలమ్మ తల్లి ఆలయం ఇదివరకే మంజూరు చేయడం జరిగింది. ఈ ఆలయాలకు త్వరలో టెండర్ పిలిపించి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి, కంబ్లె విఠల్, సాయన్న, రాములు,నవీన్,లక్ష్మణ్, పిరజీ, భోజన్న, బాలు, దేవన్న,లింగం, మురళి, భోజన, హన్మాండ్లు, గంగన్న, ముత్తన్న, సురేష్, పోతన్న మరియు గ్రామస్తులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment