అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు – ఆగస్టు 28
ప్రొద్దుటూరు అమ్మానాన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న పోలు పాపులమ్మ (100) వృద్ధురాలు అనారోగ్యంతో కన్నుమూశారు.
ఆమె అంత్యక్రియలకు బంధువులు ఎవరూ రాకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ని సంప్రదించారు.
సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు, గురువారం రోజున హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, అహమ్మద్ హుస్సేన్, ఈశ్వర్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు మరియు ఇతరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
💐 ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని వృద్ధాశ్రమ నిర్వాహకులు తెలిపారు.
📞 వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ నెంబర్లను సంప్రదించవచ్చు:
➡️ 82972 53484
➡️ 91822 44150