బీసీ బంద్ కు అందరి మద్దతు
నిజామాబాద్ మనోరంజరి ప్రతినిధి అక్టోబర్ 16
తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు ఈనెల 18న తలపెట్టిన బిసి బంద్ కు కాంగ్రెస్, బిజెపి. టిఆర్ఎస్, టిడిపి, సీపీఐ, సిపిఎం. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంతా ఎమ్బిఎం పార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, డాక్టర్లు, లాయర్లు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, బీసీ సంఘాలు, గంజి వర్తక సంఘం, దద్వాయి సంఘం. మర్చంట్ అసోసియేషన్ అసోసియేషన్, సిల్వర్ అండ్ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్, బట్టల దుకాణాల అసోసియేషన్, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు, కిరాణా దుకాణం అసోసియేషన్ అన్ని మూకుముడిగా బిసి బంద్ కు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ లో గురువారం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అన్ని సంఘాలు ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటామని బీసీ జేఏసీకి హామీ ఇచ్చాయి. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. వక్తలు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం అమలు జరిగే వరకూ శాంతి ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాటం సే కులాల జాయింట్ నాకన్ కమీటి (జేఏసీ) లామాబాద్ జిల్లా లోను తెలంగాణ ఉద్యమ సమయం లోనే గాక నేటి వరకు ప్రతి సందర్భంలోనూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఏకరువు పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఎలా కల్పించారో అదే పద్ధతిలో బీసీ రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు 60 శాతం వాటా దక్కవలసిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ ఎవరు అడగకున్నా 10 శాతం రిజర్వేషన్ అమలు చేశారని, బీసీలు రిజర్వేషన్ పెంపును కోరుతున్న రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. తమ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నందుకు బదులుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాల్సిందేనని తాము సైతం కోర్టుకు పోతామని ముక్క కాటుకు చెప్పు దెబ్బల జవాబు ఇస్తామని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాలో ఉన్న పది శాతం ఎవరిదని ప్రశ్నించారు. అది జనరల్ కోట నుండి ఇచ్చారని ఆ జెనరల్ కోటాలో బహుజనల వాటా తొమ్మిది శాతం ఉందని స్పష్టం చేశారు. ఆ ఈడబ్ల్యూఎస్ 9% వాటాను బహుజనులకు పంచాల్సిందేనని తేల్చిచెప్పారు. 10% ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ ఇవ్వడం పల్ల జనరల్ కోటాలో తమ బహుజనులు 9% వాటా కోల్పోతున్నారని పెర్కోన్నారు. ఈ వాటా బహుజనులది కాదు అనే దమ్ము ఎవరికైనా ఉండా అని సవాల్ విసిరారు. జనరల్ కోట 50% నుండి 40 శాతం తగ్గించడం బహుజనుల హక్కులను కాలరాయడం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య టీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ చెడిసి చైర్మన్ చాదన్న గారి విరబ్రావు, బిజెపి ఓటీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్. కాంగ్రెస్ ఓలీస్ సెల్ జిల్లా అధ్యక్షులు రాజ సరేందర్ గౌడ్, సిపిఐ జిల్లా నగర కార్యదర్శి ఓమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాసంతా నగర కార్యదర్శి సుధాకర్, బిసి రాజ్యాధికార పార్టీ నాయకులు గంగాధర్, ఎంబఎం నాయకులు పాప, టిడిపి నాయకులు కోయాడి నర్సింలు, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పులాంగ్ మోహన్, డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ విశాల్, బార్ అసోసియేషన్ నాయకులు శ్యామ్, మేరు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందల మురళి, జర్నలిస్ట్ ఫోరం నాయకులు జమాల్పూర్ గణేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాకాల నర్సింలు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైర శేఖర్, గాయత్రి విశ్వకర్మ వడ్రంగి సంఘం అధ్యక్షులు కే సంజీవ్, బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆదే ప్రవీణ్, వంజరి సంఘం జిల్లా నాయకులు మాస్టర్ శంకర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారా గౌడ్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవతే ప్రతాప్, బిసి ఇంటలెక్చువర్ ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బిజెపి నాయకులు భూస శంకర్, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎండల ప్రదీప్, జేఏసీ కమిటీ నాయకులు చింతకాయల రాజు, జర్నలిస్టులు పంచారెడ్డి శ్రీకాంత్, రవీందర్ గౌడ్, చత్రపతి శివాజీ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, బీసీ జేఏసీ నాయకులు ఐలాపూర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.