సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌: యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల

  • యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
  • సెప్టెంబర్ 29 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి
  • సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2024

సివిల్స్ మెయిన్స్ 2024 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అలర్ట్‌గా ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.

 

సివిల్స్ మెయిన్స్ 2024 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు యూపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా సివిల్స్ మెయిన్స్ 2024 పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డులను సెప్టెంబర్ 29, 2024 వరకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లేదా upsconline.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 1056 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసే విధానం:

  1. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో “యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024” లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  4. అడ్మిట్ కార్డు డిస్‌ప్లే అయ్యాక, డౌన్లోడ్ చేసుకోవాలి.

Leave a Comment