భారత సినిమాలపై అక్కసు.. కెనడాలో థియేటర్ దహనం
కెనడా, అక్టోబర్ 3: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సినిమాలపై వెళ్లగక్కుతున్న అక్కసు కెనడా వరకూ చేరింది. కన్నడ సినిమా ‘కాంతార చాప్టర్ 1’, పవన్ లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ ప్రదర్శిస్తున్న కెనడాలోని థియేటర్ను దుండగులు తగులబెట్టారు.
ఓక్విల్లేలో ఉన్న ఒక సినిమా థియేటర్ దగ్గరకు వచ్చిన ఇద్దరు యువకులు థియేటర్ తలుపు మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇద్దరూ ముఖాలకు ముసుగులు ధరించి ఒక SUV కారులో సినిమా హాల్ దగ్గరకు వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ మొత్తం ఘటన CCTVలో రికార్డైంది..