విశ్వకర్మ భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి

విశ్వకర్మ భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి

విశ్వబ్రాహ్మణుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయని ఆందోళన

కులవృత్తుల రక్షణకు విశ్వకర్మ భీమా పథకం అవసరమని డిమాండ్

ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణుల ఆర్థిక స్థితి పట్ల సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి నవంబర్ 01

విశ్వబ్రాహ్మణుల వరస ఆత్మహత్యలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓబులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం, మెదక్ జిల్లా లష్కరి నరేష్ చారి వంటి పలువురు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
విశ్వబ్రాహ్మణులు అయిన కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, కంచరి, శిల్పకారులు వంటి చేతివృత్తిదారులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల ప్రభావంతో సంప్రదాయ వృత్తులు కోల్పోయి జీవనోపాధి కష్టమైందని తెలిపారు. ప్రభుత్వం తక్షణం విశ్వకర్మ భీమా పథకంను అమలు చేయడంతో పాటు విశ్వబ్రాహ్మణులకు ₹5000 పెన్షన్ ఇవ్వాలని, రుణాలు మంజూరు చేసి ఆర్థిక సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే అన్ని విశ్వబ్రాహ్మణ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ హక్కులు సాధించాలన్నారు. సంప్రదాయ వృత్తులు, సంస్కృతిని కాపాడుతూ విశ్వబ్రాహ్మణుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం సమాజ బాధ్యత అని శ్రీరామ్ మహిపాల్ చారి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment