శ్రీకాకుళం, 14 July
ఎల్ నీనో ప్రభావంత తెలుగు రాష్ట్రాల్ల వర్షాలు కురవకపవడంత పంటలు తీవ్రంగా ష్టపతు్ాయ. కళ్లముందే పచ్చ పైరు ఎండపతుండటంత రైతులు ఆందళ చెందుతు్ారు. శ్రీకాకుళం జల్లాల బందెలత ీరు పెట్టగా, భద్రాద్ర, మహబూబాబాద్ జల్లాల్ల ట్యాంకర్లత ీరు పడుతు్ారు.
ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. దీంతో నీరు లేక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కళ్ల ముందే పచ్చని పైరు ఎండిపోతుండటంతో అన్నదాత గుండె బరువెక్కుతోంది. ఎలాగైనా కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కొందరు నీటి బిందెలతో వరి పైరును తడపగా, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టిన హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.











