ఎరువుల దుకాణాలు తనిఖీ..నమూనాలు సేకరణ :వ్యవసాయాధికారి ఎం.ఋష్యేంద్రమణి
మిర్యాలగూడ జూలై 13 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని ఎరువుల దుకాణాలను సోమవారం మిర్యాలగూడ మండల వ్యవసాయాధికారి ఎం.ఋష్యేంద్రమణి తనిఖీలు చేశారు. విక్రయాల్లో మోసాలు జరగకుండా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎరువుల నమూనాలు ఆమె సేకరించారు. పట్టణంలోని సాయి మహేశ్వర ఫర్టిలైజర్స్, సిద్ధి వినాయక ఫర్టిలైజర్స్ లలో నిర్వహించి ఎరువుల శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. తనిఖీల్లో ఫర్టిలైజర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు, ఎరువుల డీలర్లు బిక్షం, శ్రీనివాస్ లున్నారు.











