అల్లవరం, 2026-07-21
వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని, రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీట్ పేపర్ లీక్పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జులై 16 నాటికి 243.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 159.1 మి.మీ మాత్రమే నమోదైందని వివరించారు. దీంతో 35 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఈ అంశాన్ని పార్లమెంట్ 'జీరో అవర్'లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, సభ పదేపదే వాయిదా పడటంతో మాట్లాడే అవకాశం దక్కలేదన్నారు.
నీట్ పేపర్ లీక్పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై లోక్సభలో చర్చ జరపాల ని కోరుతూ ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












