మిర్యాలగూడ, జూన్ 30
మిర్యాలగూడ మండలంలోని హాట్యా తండా గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, జాతీయ మాంస పశు పరిశోధనా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, పశుపాలకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
మిర్యాలగూడ మండలంలోని హాట్యా తండా గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, జాతీయ మాంస పశు పరిశోధనా సంస్థ సహకారంతో నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు, పశుపాలకుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాడి పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.
శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు, టీకాలు, మందులు ఉచితంగా అందించారు. పశుపోషణ, వ్యాధి నివారణ, శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కేతావత్ శంకర్ నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారులు, జాతీయ మాంస పశు పరిశోధనా సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












