Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
ా ని కరటిక్ గ్రా శివారు ఉన్న గుర్రపుకుట గుర్రపుకుంట చెరువుకు భారీ వర్షా కారణగా గి పిది. చెరువు ని్వ ఉన్న నీరు బయటకు ప్రవహిస్తూ సీప వ్యవసాయ భూు్కి చేరుతుటత రైతుు ఆదళన చెదుతున్నారు. అధికారుు గిని పూ్చేదుకు చర్యు చేపట్టారు.
మామడ మండలంలోని కోరటికల్ గ్రామ శివారులో ఉన్న గుర్రపుకుంట చెరువుకు గండి పడడంతో భారీగా నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులో నీటి మట్టం పెరగడంతో ఈ గండి ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.
గండి ద్వారా బయటకు వస్తున్న నీరు సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి చేరుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న గ్రామపంచాయతీ అధికారులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గండిని పూడ్చేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు.
అదేవిధంగా, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించి, చెరువుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరారు. చెరువు నీరు వేగంగా బయటకు పోతుండటంతో చెరువు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చి, చెరువును రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.












