లక్ష్మణ్ చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
థయయహఘయయఋఇైడథబఘ2షయఅజే.షగఎ,గఅథథగేషఈృషథఘథ.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో వ్యవసాయ ఋణం తీసుకున్న లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన సుంకరి పెద్ద ఎల్లన్న, మునిపెల్లి గ్రామానికి చెందిన అలిశెట్టి గణేష్ అనే ఇద్దరు రైతులు మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలకు సంఘం తరపున 2,00,000 రూపాయల భీమా చెక్కులను అందజేశారు.
లక్ష్మణ్ చందా సహకార సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ శ్రీ ఎర్ర రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ సింగం వెంకట రాజు, డైరెక్టర్లు రాజా రెడ్డి, నరేష్ లు మృతుల కుటుంబ సభ్యులకు భీమా చెక్కులను అందజేశారు. రైతుల సంక్షేమానికి సంఘం అన్ని విధాల అండగా ఉంటుందని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు.
రైతులందరూ తమ ఆధార్ వివరాలను సంఘంలో నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, సాయి ప్రసాద్, సంఘ కార్యదర్శి వజీర్ పాష, శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఈటెల శ్రీనివాస్, లక్ష్మణ్ చందా సర్పంచ్ ఓస కవిత రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి, తాజా మాజీ జెడ్పిటిసి ఓసరాజేశ్వర్,తాజా మాజీ ఎంపీపీ అడ్వాల పద్మా రమేష్ మరియు సంఘ సిబ్బంది రమణ, నర్సయ్య, సతీష్, సాయి, రాజేశ్వర్ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.












