నిర్మల్, ఆగస్టు 1
నిర్ల్ జిల్లాకు జీవనాధారైన కడెం, స్వర్ణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ న్ ఆరపించారు. దశాబ్దాలుగా పూడికతీత చేపట్టకపవడంత ప్రాజెక్టుల నీటి నిల్వ సార్థ్యం తగ్గిపతందని ఆయన ఆందళన వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా రైతాంగానికి జీవనాడిగా ఉన్న కడెం, స్వర్ణ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ ఆరోపించారు. శనివారం కడెం ప్రాజెక్టును సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఈ రెండు ప్రాజెక్టుల్లో సమగ్ర పూడికతీత చేపట్టకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రాజెక్టులు నిండినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చి పరిశీలనలు చేసి ఫోటోలు దిగడం తప్ప రైతులకు ప్రయోజనం చేకూరే శాశ్వత పనులు చేపట్టడం లేదని విమర్శించారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు సమగ్ర పూడికతీత ఎందుకు చేపట్టలేదని, నిర్వహణకు కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
స్వర్ణ ప్రాజెక్టు గేట్ల నిర్వహణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని, గేట్లను తాత్కాలికంగా తాడులతో కట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. నీటిపారుదల శాఖలో తగిన సిబ్బంది లేకపోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కడెం, స్వర్ణ ప్రాజెక్టుల్లో వెంటనే సమగ్ర పూడికతీత చేపట్టాలని, డ్యామ్లు, గేట్ల భద్రతపై నిపుణులతో ప్రత్యేక సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని, నిర్వహణ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జ్ జోసెఫ్ గంగారాం, పార్టీ నాయకులు కోక్కరకారి రాజేష్, ఆర్ల రమేష్, పసుపుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.












