ఇందరవెల్లి, 11 July
ఇంద్రవెల్లి మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాల తర్వాత వాతావరణం మారి, ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో మొలకెత్తిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఇంద్రవెల్లి మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో వరుణుడు ముఖం చాటేశాడు. కొద్దిరోజుల క్రితం విస్తారంగా కురిసిన వర్షాలకు భిన్నంగా, ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే మొలుస్తున్న పంట మొలకలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బోరుబావుల ద్వారా, మరికొందరు డ్రమ్ములతో నీళ్లు పోసి పంటలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు.












