బోథ్ మార్కెట్లో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ, రైతులు తమ పంటలను దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై అవగాహనతో సరైన ధరకు విక్రయించాలని సూచించారు.
హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ సమ్మర్ క్యాంపుల నేపథ్యంలో మొబైల్ లోక్ అదాలత్ వాహనం బోథ్ కోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా బోథ్ మార్కెట్లో రైతులకు న్యాయ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ, రైతులు వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నప్పుడు లోక్ అదాలత్, న్యాయ సేవా సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. తమ హక్కులపై అవగాహన పెంచుకుని న్యాయ పరిరక్షణ పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా రైతులు దళారుల జోక్యం లేకుండా నేరుగా కొనుగోలుదారులతో సంప్రదించడం వల్ల మంచి ధర పొందే అవకాశం ఉందని వివరించారు. ఎంఎస్పీ అమలుపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కుమ్మరి విజయ్ కుమార్, కరాత్వడా సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు, కుమ్మరి రాజు, మల్లెపూల మహేందర్, సింగం రమణ వంటి పలువురు రైతులు, అధికారులు పాల్గొన్నారు.











