Kurnool/Maddikera West (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిపుణుల కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. ఈ నెల 22న ప్రజాభవన్‌లో నిపుణుల కమిటీ తొలి సమావేశం జరగనుంది.
ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిపుణుల కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. ఈ నెల 22న ప్రజాభవన్‌లో నిపుణుల కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సోమవారం బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతు కమిషన్ బృందంతో చిన్నారెడ్డి సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన నివేదిక, సూచనలు అందించేందుకు ప్రభుత్వం ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కన్వీనర్‌గా, మరో 25 మంది ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై రైతు కమిషన్ రూపొందించిన రెండు ప్రత్యేక నివేదికలను ఈ సందర్భంగా నిపుణుల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి కమిషన్ బృందం అందజేసింది.












