మిర్యాలగూడ, జూలై 13
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తెలిపారు.
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) తెలిపారు.
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఇరిగేషన్ పనులపై బిఎల్ఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎడమ కాలువ పరిధిలో జరుగుతున్న కాలువ పనులను సందర్శించి పరిశీలించారు.
మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో రైతులకు బావులు, బోర్లులో నీటి శాతం తగ్గకుండా ఉంటుందన్నారు. ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో చేపట్టాల్సిన కొత్త ఇరిగేషన్ ప్రతిపాదనలపై కూడా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో 11 కోట్లతో నిర్వహిస్తున్న ఎడమ కాలువ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఎస్.సి మల్లికార్జున రావు, ఈఈలు గోపినాథ్, మనోహర్, డిఈలు, జేఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.











