హైదరాబాద్, 2026-06-05
సాధారణంగా ఆవుల ధరలు వేలల్లోనే ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ఒక ఆవు ధర ఏకంగా కోట్లలో ఉంది. బ్రెజిల్‌కు చెందిన వియాటినా-19 ఎఫ్ఐవి మారా ఇమోవిస్ అనే నెలోర్ జాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. దీని విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు.
సాధారణంగా ఆవుల ధరలు వేలల్లోనే ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ఒక ఆవు ధర ఏకంగా కోట్లలో ఉంది. దాన్ని కొనాలంటే కేవలం అంబానీ, అదానీ, మస్క్ వంటి బిలియనీర్ల వల్లే అవుతుంది. బ్రెజిల్‌కు చెందిన వియాటినా-19 ఎఫ్ఐవి మారా ఇమోవిస్ (-19 ) అనే నెలోర్ జాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. దీని విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు.
అధిక ధర వెనుక కారణాలు
ఇది ఎందుకింత ఖరీదో అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఆ ఆవు పరిమాణం లేదా రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది. అలాగే అరుదైన జన్యు లక్షణాలు, అద్భుతమైన పునరుత్పత్తి సామర్థ్యం, వేడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వంటివి దీనికి ఉన్నాయి. సుమారు నాలుగన్నర ఏళ్ల వయసున్న ఈ వియాటినా-19 ఆవును బ్రెజిల్‌లోని అరాండులో జరిగిన వేలంలో ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని ఖరీదు 35 కోట్ల రూపాయలకు వరకు ఉంటుంది.
నెలోర్ జాతి ప్రత్యేకతలు
ఈ ఆవు చూసేందుకు చాలా కొత్తగా ఉంటుంది. బ్రెజిల్లో అత్యంత ముఖ్యమైన పశువుల జాతుల్లో నెలోర్ ఒకటి. ఈ జాతి ఆవులు సాధారణంగా తెల్లగా లేదా లేత రంగు చర్మంతో, భుజాలపై పెద్ద మూపురంతో, వదులుగా ఉండే చర్మంతో ఉంటాయి. ఇవి ఎంత వేడి వాతావరణాన్ని అయినా తట్టుకుంటాయి. కొన్ని యూరోపియన్ జాతులతో పోలిస్తే నెలోర్ ఆవులకు చెమట గ్రంథులు పెద్దవిగా, ఎక్కువగా ఉంటాయి. ఇది వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాటి మందపాటి చర్మం కీటకాలు, పరాన్నజీవుల నుండి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఉష్ణమండల పరిస్థితులకు నెలోర్ జాతి సరిగ్గా సరిపోతుంది.
నెల్లూరుతో అనుబంధం
ఈ నెలోర్ జాతి ఆవులకు నెల్లూరుతో అనుబంధం ఉంది. నెలోర్ అనే పేరు మన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నుండి వచ్చింది. ఈ జాతి ఆవులు వాటి విశిష్ట లక్షణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.












