దేవరకద్ర, 2026-06-05
దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి లోకసముద్రం కట్టను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుండే సాగునీటి అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి లోకసముద్రం కట్టను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుండే సాగునీటి అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రైతుల తో ఆత్మీయంగా మమేకమై, వారితో కలిసి భోజనం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.