ఏజెన్సీ సమస్యల పరిష్కారానికి కవితను కోరిన ఏజెన్సీ సాధన కమిటీ
మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఏజెన్సీ సాధన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, నిరుద్యోగుల ఇబ్బందులను వివరించారు. సభ్యులు కవిత ను జీవో నంబర్ 3ను పునరుద్ధరించడానికి కృషి చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజెన్సీ సాధన కమిటీ సభ్యుడు జాదవ్ సుమేష్, ఏజెన్సీ నిరుద్యోగుల సంఘ అధ్యక్షుడు కుమార్ భూక్య, వసంత తదితరులు పాల్గొన్నారు.