తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఓపెన్ టెన్త్,ఓపెన్ ఇంటర్లలో ప్రవేశాలు
నిర్మల్ జిల్లా బైంసా జూలై 4: తెలంగాణ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నందు ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఈ నెల 11వ తేదీ ఎటువంటి అదనపు లేకుండా అడ్మిషన్లు మీ సేవలో లేదా ఇంటర్నెట్లో చేసుకోవాలని వేదం హైస్కూల్ బైంసా కోఆర్డినేటర్ సాప పండరి తెలిపారు. ప్రభుత్వం అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి మధ్యలో చదువు మానేసినటువంటి యువతి యువకులకు, బాల బాలికలకు, గృహిణులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించిందని, ఎటువంటి చదువులు చదవని వారు 14 సంవత్సరాలకు పైబడిన వారు సైతం పదవ తరగతి చదవవచ్చు అని, ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం కలదని,తెలుగు,ఇంగ్లీష్, హిందీ,ఉర్దూ మాధ్యమాలలో అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. పదవ తరగతిలో చేరే అభ్యర్థులు మీరు చదివిన ఏదో ఒక తరగతి టిసి,ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్ ఫోటో-ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ తీసుకునేవారు పదవ తరగతి లాంగ్ మెమో, ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్ ఫోటో తీసుకువెళ్లి మీ సేవలో అడ్మిషన్ కావాలన్నారు. ఇట్టి సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రమోషన్లకు,ఉన్నత చదువులకు వర్తించునని,సరళమైన పదాలతో, కేవలం ఐదు సబ్జెక్టులతో సులభంగా సెలవు దినాలలో తరగతులకు హాజరై ఉత్తీర్ణత సాధించవచ్చని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడాఅర్హులేనని, యువకులు అగ్నివీర్,అగ్నిపత్, కానిస్టేబుల్,మహిళలు అంగన్వాడి టీచర్లుగా,ఆశ వర్కర్లుగా,ఏఎన్ఎమ్ గా పలు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ఇట్టి సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9848227016 ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరని తెలియజేశారు