రాహుల్ గాంధీని భారత ప్రధాని చేయడమే లక్ష్యం – ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

రాహుల్ గాంధీని భారత ప్రధాని చేయడమే లక్ష్యం

– ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్, సెప్టెంబర్ 11

2029లో రాహుల్ గాంధీ గారిని భారత ప్రధానిగా చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తేజవాత్ బెల్లయ్య నాయక్ ముఖ్య దిశానిర్దేశం చేశారని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ గురువారం తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రజలకు మంచి సంక్షేమ పథకాలను అందిస్తూ దేశవ్యాప్తంగా సమగ్ర ప్రచారాన్ని జరుపాలని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రజాభిప్రాయాన్ని సాకారం చేయాలని స్పష్టం చేశారు.కేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించినప్పటికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రామాణికత లేకపోవడం ఘాటు విమర్శనీయమని బాణావత్ అన్నారు.దేశానికి ప్రజల హితమే నిబద్ధతగా, దేశాభివృద్ధికి మంచి ప్రభుత్వం కావాలి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా సాధ్యమని స్పష్టం చేశారు.
👉 రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత బలంగా ప్రజల హక్కుల కోసం ముందుకు రావడం కొనసాగిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ డాక్టర్ తేజవాత్ బెల్లయ్య నాయక్ నిరంతరం కృషి చేస్తుండడం ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment