ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్: అక్టోబర్ 17, 2024
గోండు వీరుడు కొమురం భీమ్ జాతి హక్కుల కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, తలమల గ్రామస్తులు మరియు ఆదివాసీ నాయకులు గురువారం జోడేఘాట్‌కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు కొమురం భీమ్ ఆదివాసీ సమాజానికి చేసిన త్యాగాలను స్మరించి, ఆయనే ఆదివాసీ సమాజానికి అద్భుతమైన మార్గదర్శకుడని కొనియాడారు. ఆదివాసీ హక్కుల కోసం సాయుధ పోరాటం చేసి నిజాం సర్కార్‌కి సవాలు చేసిన భీమ్ స్పూర్తితో, ఆదివాసీ హక్కులను కాపాడడంలో ఐక్యత అవసరమని వారు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు: తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు గెడం బొజ్జీరావు, మండల నాయకులు మెస్రం చిత్రు, కుర్సెంగ కిష్టు, కోవ బాదు, పూసం లింబరావు, పుసం చిత్రు తదితరులు, మహిళా ప్రతినిధులు.