- ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి షాద్ నగర్ లో ఆదిత్య న్యూరో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభం.
- నరాల వ్యాధుల చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదని అన్నారు.
- హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి గురువారం షాద్ నగర్ పట్టణంలో ఆదిత్య న్యూరో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. శరీరంలోని నరాల వ్యాధులు చికిత్స కోసం మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం ఇక లేకుండా చేసేందుకు ఈ హాస్పిటల్ ఉద్దేశించినదని ఆయన తెలిపారు. షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ బచ్చలి నరసింహ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి గురువారం షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఆదిత్య న్యూరో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన శరీరంలో నరాలు విశేషమైన ప్రాధాన్యత కలిగినవి. నరాలకు సంబంధించి ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు వాటిని గుర్తించడం చాలా కష్టం. అలాంటి రుగ్మతలు ఏర్పడినప్పుడు మహానగరాలే కాదు, ఇక మన షాద్ నగర్లోనే పూర్తిగా చికిత్స అందుకోవచ్చు” అని తెలిపారు.
హాస్పిటల్ ప్రారంభోత్సవంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ బచ్చలి నరసింహ, హాస్పిటల్ యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.