ఆదిలాబాద్: “ఐ లవ్ ముహమ్మద్” బోర్డులపై ఫిర్యాదు–ప్రజల నిరసనలు
మనోరంజని ప్రతినిధి, ఆదిలాబాద్ – సెప్టెంబర్ 21
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో “ఐ లవ్ ముహమ్మద్” బోర్డులు పెట్టడంపై ఫిర్యాదు నమోదు కావడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనికి ప్రతిస్పందనగా ఆదిలాబాద్‌లోని ఉర్దూఘర్ షాదీ ఖానా వద్ద ఆదివారం నాడు ప్రజలు నిరసనలు నిర్వహించారు.
సమావేశంలో సోషల్ మీడియాలో ఈ సంఘటనపై చర్చలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల ఇలాంటి సందేశాలను ప్రదర్శించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించగా, ఇది చర్చలకు మార్గం కలిగించింది.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ,
“ముహమ్మద్ ఇస్లాం మతంలోని చివరి ప్రవక్త, దేవునిచే పంపబడిన దైవ దూతగా ముస్లింలు విశ్వసిస్తారు. ఆయన బోధనలు ఖురాన్‌లో నమోదు అయి, మత విశ్వాసానికి, ఆచారాలకు పునాదిగా ఉన్నాయి” అని తెలిపారు.
కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు కలిసి బోర్డులపై నిరసన వ్యక్తం చేశారు.