అధిష్టానం అండదండలు ఆనంద్ రావ్ పటేల్ కే

Anand Rao Patel Chairman Appointment

మాజీ ఎమ్మెల్యే ల అభిప్రాయం పక్కన పెట్టి అసలు కార్యకర్త కు అందలం
ఇక ముధోల్ లో ఆనంద్ రావ్ రాజకీయం

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 23

అధికారం లోకి వచ్చాక కొందరు కాంగ్రెస్ లో చేరడం, ఎన్నికల ముందు ఒకరు కాంగ్రెస్ లో వచ్చి పోటి చేయడం తో అధిష్టానం ఇది గ్రహించి అవకాశ వాదులను పక్కన బెట్టి ఆనంద్ రావ్ పటేల్ కు అవకాశం ఇచ్చింది.. మొదట్లో మాజీ ఎమ్మెల్యే లు తమ కుటుంబ సభ్యులకు, లేదా తమ అనుచర గణానికి మార్కెట్ చైర్మన్ ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసారు. అయితే ఆనంద్ రావ్ పటేల్ కు రాహుల్ గాంధీ తో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జి మంత్రి సీతక్క తో పాటు సీనియర్ నాయకులతో మంచి సంబంధాలు ఉండడం తో ఎవ్వరి పాచికలు పారలేదు.. ఒకరేమో ఆనంద్ రావ్ పటేల్ కు వద్దని పట్టు బట్టారు. మరొకరు తమ పాచికలు పారక పోవడం తో వైస్ చైర్మన్ పదవి, డైరెక్టర్ ల పదవి తో సరిపెట్టు కున్నారు.. తమ ది పై చేయి అయిందని ఓ మాజీ ఎమ్మెల్యే వర్గం భావిస్తున్న, లోలోపల తమ పాచికలు ఇక పారవని వారికి అర్థమైంది.. స్థానిక సంస్థల ఎన్నికలు, వస్తున్న తరుణం లో ఆనంద్ రావ్ పటేల్ ను ప్రోత్సహించి రానున్న రోజుల్లో ఆయనకే పూర్తి పగ్గాలు అధిష్టానం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వర్గ విభేదాలతో విసిగిపోయిన అసలు కాంగ్రెస్ వాదులు ఇంకా ఆనంద్ రావ్ పటేల్ చెంత చేరుతారు. ఇక నుంచి ముధోల్ లో ఆనంద్ రావ్ రాజకీయం నడుస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు.. అవకాశ వాదులకు పక్కన పెట్టి ఆనంద్ రావ్ పటేల్ కు చైర్మన్ పదవి ఇవ్వడం మంచి పని చేశారన్న చర్చ వినిపిస్తుంది…

Join WhatsApp

Join Now

Leave a Comment