ఆడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఆడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఆడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 27

ఆడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

నిర్మల్ జిల్లా ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటైన ఆడెల్లి పోచమ్మ దేవస్థానంలో ప్రతీ ఏటా జరిగే గంగనీళ్ల జాతరకు ఈసారి కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు.

ఆడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఈ రోజు ప్రారంభమయ్యే అమ్మవారి ఆభరణాల శుద్ధి కార్యక్రమం సారంగాపూర్–దిలావార్పూర్–ముజ్గి మీదుగా సాంగ్వి గ్రామ శివారులో గల పోచమ్మ గుడి వద్ద గోదావరి జలాలతో ఆభరణాలను పవిత్రం చేయడం ద్వారా నిర్వహించబడుతుంది. అనంతరం రేపు తెల్లవారుజామున ఆభరణాలు ఘనంగా మంగళ వాయిద్యాల నడుమ అదెల్లి పోచమ్మ దేవస్థానానికి తరలించబడతాయి.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. కావున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి దశలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలి” అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి ఘాట్ వద్ద వరద నీరు అధికంగా ఉండటంతో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు ఆ ప్రాంతానికి చేరకుండా చూడాలని సూచించారు.

జాతర ప్రాంగణం, ప్రధాన రహదారులు, ఆలయ పరిసరాల్లో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ వాహనాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షణ జరుగుతుంది. ఆభరణాలు తరలించే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, అత్యవసర వైద్య సహాయం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొననుండటంతో, శివంగి మహిళా బృందాన్ని ప్రత్యేకంగా నియమించారు. భక్తులు అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు మల్లేష్, రవీందర్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, సాయి కుమార్, సమ్మయ్య, ఎస్ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment