ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి .. అడిషనల్ కలెక్టర్

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి ..
అడిషనల్ కలెక్టర్

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 24

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి ..
అడిషనల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా సారంగాపూర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ పంచాయతీ కార్యదర్శి అధికారులతో శుక్రవారం రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఆదేశించారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి, రుణాలు సకాలంలో అందేలా చూడాలని ఆయన సూచించారు. ఈ పథకం లక్ష్యం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమేనని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ నొక్కి చెప్పారు. డిసెంబర్ 15 లోపు లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయించాలి అధికారులతో సూచనలు చేశారు ఆర్థికంగా లేనివారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు,, ఎం పి ఓ అజీజ్ ఖాన్, గృహ నిర్మాణశాఖ అధికారులు, మండల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment