స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

నిర్మల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించబోవు అధికారులకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అధికారి తమ విధులకు సంబంధించి పూర్తి వివరాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం ఆయా అధికారులకు కేటాయించిన విధులను నిర్వర్తించి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. శిక్షకులు అందించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎటువంటి సందేహాలు ఉన్నా, పైఅధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జడ్పి సీఈవో గోవింద్, డిఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment