కాసుల వర్షం కురిపించిన అదానీ గ్రూప్ స్టాక్స్.. ఒక్క రోజే 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్..
లార్జ్ క్యాప్ కేటగిరికి చెందిన పవర్ సెక్టార్ స్టాక్ అయిన అదానీ పవర్ లిమిటెడ్, తమ వాటాదారులపై కాసుల వర్షం కురిపిస్తుంది. ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో ఈ కంపెనీ షేరు ఏకంగా 20 శాతం లాభాపడి అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేయడం జరిగింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ జనవరి 20 న బాధ్యతలు స్వీకరించిన తరువాత యూఎస్ లంచం కేసులో అదానీకి క్లీన్ చిట్ లభించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ లో సందడి నెలకొనడంతో ఈరోజు ఈ కంపెనీ షేరులో భారీ ర్యాలీ కనిపిస్తుంది