కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం – కొరిపెల్లి రామ్ కిషన్ రెడ్డి

కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం – కొరిపెల్లి రామ్ కిషన్ రెడ్డి

కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం – కొరిపెల్లి రామ్ కిషన్ రెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 17

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవి శంకర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొరిపెల్లి రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం అని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఆరు గ్యారంటీల పేరుతో మభ్యపెట్టిందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మార్గొండ రాము మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి కన్నా మత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాష్ రావు, జీవన్ రావు, మధుకర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, భోజన్న, లక్ష్మణ్, గట్టు గంగాధర్, ప్రవీణ్, రాజన్న, దత్తురాం, గజేందర్, గంగన్న, సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వర్, సతీష్, ప్రభాకర్ రెడ్డి, వెంకట్, ప్రహల్లాద, బద్రి, నారాయణ, సతీష్ మరియు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment