ముషీరాబాద్, 17 July
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బెర్హంపుర్ వద్ద రైల్వే క్రాసింగ్‌లో స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెర్హంపుర్ వద్ద రైలు స్కూల్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే, రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే గేట్ తెరిచే ఉండిందని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.












